1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 12 జులై 2022 (21:42 IST)

శ్రావణ మాసం: ఈ నాలుగు రాశుల వారికి యోగం..?

Diya
శ్రావణ మాసం జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలలో పాటు శివుడిని పూజిస్తారు.
 
ఈ మాసంలో శివుని ఆశీస్సులు మాత్రమే కాదు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. అవి ఏ రాశిలో తెలుసుకుందాం..
 
ధనుస్సు – ఈ రాశి వారిపై లక్ష్మీదేవి విశేష అనుగ్రహం ఉంటుంది. కొత్త, మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. సంపదకు, ధనధాన్యాలకు కొరత వుండదు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ మాసం చాలా మంచిది.
 
సింహ రాశి – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనాదాయం వుంటుంది. శ్రావణ మాసంలో ఆరోగ్యంగా ఉంటారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. కార్యసిద్ధి వుంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
 
తులారాశి – శ్రావణ మాసం తుల రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సరస్వతీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. 
 
మిథునరాశి – మిధున రాశి వారికి కూడా ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ మాసంలో ఎవరికైనా దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది.