శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (22:33 IST)

ప్రభాస్ పెళ్లి గోల... శ్రావణమాసంలో వుంటుందా?

prabhas
బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతుంది. అప్పటి నుండి ప్రభాస్ పెళ్లిపై పుకార్లు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రభాస్ పెళ్లి పెదనాన్న కృష్ణంరాజుకు తలనొప్పిగా మారింది. ఆయన ఎక్కడెక్కినా ప్రభాస్ పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. 
 
తాజాగా కృష్ణంరాజుకు ఇదే ప్రశ్న ఎదురుకాగా స్పష్టత ఇచ్చారట. 2022లోనే ప్రభాస్ వివాహం ఉంటుందన్నారట. దాదాపు వచ్చే శ్రావణమాసంలో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని హింట్ ఇచ్చారు. 
 
కృష్ణంరాజుతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తుంది.
 
కాగా అమ్మాయి ఎవరనే వివరాలు వెల్లడించలేదట. అమ్మాయి గురించి చెబితే మీడియా ఫోకస్ ఎక్కువై, వార్తలు పుట్టుకొచ్చే ఆస్కారం కలదని పేరు , వివరాలు గోప్యంగా ఉంచారని టాక్.
 
మరోవైపు ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఏక కాలంలో ఆయన ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. 2023 జనవరిలో ఆదిపురుష్ విడుదల కానుంది. అలాగే దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీ ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.