పుష్యమి నక్షత్రంలో పుట్టారా? ముక్కుసూటిగా మాట్లాడేస్తారు!

శుక్రవారం, 30 మే 2014 (18:33 IST)
శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యము నుంచి యవ్వనము వరకు కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అంతేకాదు.. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. 
 
వ్యాపార, సినీ రంగాల్లో రాణించే పుష్యమి నక్షత్ర జాతకులు విస్తృతమైన పరిధిని కలిగి ఉంటారు. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. అంతేగాకుండా యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. మంచి సలహాదారులు వీరికి లభించినా.. కొందరి తప్పుడు సలహాలతో కొన్ని అపశృతులు దొర్లుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇకపోతే.. వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే.. శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
అదేవిధంగా.. సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో ఎలాంటి పనిని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇకపోతే వీరి అదృష్ట సంఖ్యలు:  2, 7.

అన్నీ చూడండి

విజయ్ సర్కార్ అదుర్స్ .. లంచం తీసుకునే అధికారులకు షాక్.. లక్ష నజరానా

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

Show comments