ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శ్రీ సూక్తం విశిష్టత.. శనివారాల్లో పఠిస్తే..

వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనది. జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్య సిద్ధికి వేద సూక్త పఠనం తప్పక చేయాలి. 
 
పురుష దేవుళ్లను అర్చన చేసేటప్పుడు వేదోక్తంగా పురుష సూక్త విధిలో పురోహితుని ద్వారా పూజాదికాలు చేయాలి. స్త్రీ దేవతామూర్తుల్ని పూజించేటప్పుడు శ్రీ సూక్త విధాయకంగా గోత్ర నామాదులతో అర్చన చేయడం జరుగుతుంది. విశేషంగా నిర్వహించే పూజల్లో శ్రీ సూక్త విశిష్టమైనది. 
 
శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరొకటి లేదు. నిత్య పూజాక్రియల్లో శుభకార్య నిర్వహణలో ఈ శ్రీ సూక్త పఠనానికి ప్రాధాన్యత వుంది. 
 
నిజమైన సిరి జ్ఞానమే అని శ్రీ సూక్తం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి. శుక్ర, శనివారాల్లో శ్రీ సూక్త పఠనం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయి. ధనలేమి వుండదు. అమంగళకరమైన బాహ్య ఆటంకాలన్నీ తొలగిపోతాయి.