మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (22:38 IST)

శ్రీకృష్ణుడే లేనప్పుడు ద్వారక శోభ ఎందుకని సముద్రుడు తనలోకి లాక్కున్నాడు

ద్వారకా నగరంలో 16,108 భవనాలు వుండేవట. అర్జునుడు, ధర్మరాజు, భీమ, నకుల సహదేవులు ఈ నగరానికి వచ్చారు. నగరం సముద్రంలో మునిగిపోగా మిగిలిన శ్రీకృష్ణబలరాములు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అర్జునుడు వారికి అంత్యక్రియలను యిక్కడే నిర్వహించాడని భారత కథనం.
 
శ్రీకృష్ణ పరమాత్మ తను నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోకుండా యాదవులను దాటించారు. అలా దాటించిన మరుక్షణంలో ఒక్కొక్క భవనం కూలి నీళ్లలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడే లేనప్పుడు నగర శోభ ఎందుకని సముద్రుడు ఆ సుందర నగరాన్ని తనలోకి లాక్కున్నాడు.
 
ఇప్పటికీ ద్వారకాపురి యాత్రికులకు సముద్రంలో మునిగిపోయిన చోటును చూపిస్తారు. అల్లంత దూరాన రుక్మిణీ దేవాలయం నీళ్లలో కనిపిస్తుంది. జగద్రక్షణార్థం తన లీలలు చూపుతూ మధుర, బృందావనం, యమునాతట, గోవర్థనగిరి ప్రాంతాలను పునీతం చేసి ద్వారకలో, ద్వారకాధీశుడై, మోక్షద్వారధీశుడై ద్వాపరంలో అవతరించాడు. ఆ పరమాత్మ భగవద్గీతను వివరించి మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు. అందుకే ఆ శ్రీకృష్ణుడిని మనసా కొలిచి తరిద్దాం.