పృథ్వీ స్తోత్రముతో భూపూజ చేస్తే చక్రవర్తులే.. 100 అశ్వమేధ యాగాలు చేసిన..?
అత్యంత పుణ్యప్రదమైన పృథ్వీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినట్లైతే కోటి జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. అతడు చక్రవర్తి అవుతాడు. అలాగే ఈ స్తోత్రాన్ని పఠించి భూమి దానం చేసినట్లైతే పుణ్యం లభిస్తుంది. ఇతరులకు దానం చేసిన భూమిని అపహరించడం వల్ల కలిగే పాపము తొలగిపోతుంది. భూమిని తవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొన్నట్లైతే తొలగిపోతాయి.
ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలిగిన పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందు వల్ల, దీపాది ద్రవ్యముల నుంచి కలుగు పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేగాకుండా ఈ స్తోత్రమును పఠించడం ద్వారా 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం లభిస్తుంది.
జయజయే జలా ధారే జలశీలే జలప్రదే l
యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ll
మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే l
మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ll
సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే l
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ll
పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని l
పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ll
సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే l
సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ll
భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే l
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ll
ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ l
కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ll
భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.
అర్థం : ఈ స్తోత్రాన్ని పఠించినవారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమిదానహరణపాపం నశిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమిని అపహరించుకోవడం, నేల మీద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటాపంచలవుతాయని శ్రీదేవి భాగవతములో చెప్పబడివుంది. ఈ మంత్రముతో ఆండాళ్ తాయారును స్తుతించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి.