1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. significance of srichakra hill in kailash

పరమేశ్వరుడు కొలువై వున్న శ్రీచక్ర పర్వతం

significance
కైలాసగిరి... హేమాద్రి, రజతాద్రి, సుషుమ్న కనకాచలము, దేవ పర్వతము, అమరాద్రి, సుమేరు అనే పేర్లతో విరాజిల్లుతుంది. ఈ పర్వతము రాజము పురాణప్రసిద్దము. పరమ శివుడు ఈ వెండికొండపై వేంచేసి త్రిలోకాలను రక్షిస్తున్నాడు. జగదాంబ, పార్వతీదేవి, సర్వమంగళగా సర్వజగత్తును తన మహిమోన్నతమైన శక్తిని కాపాడుతుంది. ఈ పర్వతానికి 'శ్రీచక్ర' అని కూడా వుంటారు. ఇది జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా భావిస్తారు.
 
ఇది శివుని తాండవలీలా ప్రదేశం. ఈ కొండ వింతవింతలుగా, వెండి, బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. నటరాజు యొక్క నాట్యలీలావిలాస కేంద్రం అంటూ మునులు, రుషులు కీర్తిస్తారు. ఎంతో ప్రయాలకు లోనై ఈ ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఆర్థిక భారంతో పాటు శారీరక బాధలెక్కువ.
 
ఆరోగ్యంగా వున్నవారే ప్రయాణం చేయాలి. మానస సరోవరంలో స్నానం ఆత్మానందం కలిగిస్తుంది. ఆత్మశుద్ధికి దోహదపడుతుంది. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరం దర్శించి పరమేశ్వరుని అపార కరుణాకటాక్షాలు పొందాలని ప్రార్థించుదాం. ఓ నమశ్శివాయ.
About Writer
సిహెచ్