నిద్రలేవగానే ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..?
నిద్రలేవగానే ఎవరి చేతులు వారు చూసుకుంటే.. జీవితంలో అదృష్టం వెంటనే వుంటుంది. నిద్రించే ముందు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 3సార్లు ధ్యానించాలి. ఉదయం పూట వేప, దేవతా పటాలు, రావి చెట్టు వంటి పవిత్ర వస్తువులను చూడాలి. మహిళలు ఉదయం నిద్రలేవగానే తులసికి, సూర్యునికి నమస్కరించాలి. భూమాతకు నమస్కరించాలి. రాత్రిపూట తలస్నానం చేయకూడదు.
మంగళవారం, శుక్రవారం ఇంట దుమ్ముదులపడం చేయకూడదు. ఇంకొకరికి చేతులారా నూనె, గుడ్లు, ఇవ్వకూడదు. అగ్గిపుల్లలతో దీపాలను వెలిగించకూడదు.
మంగళవారం తమలపాకులతో హనుమంతునికి పూజ చేయడం విశిష్ఠ ఫలితాలను ఇస్తుంది. దుర్గాపూజ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. భోజనం చేసే పళ్లెంలో చేయి కడగకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.