పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే..?

దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే.. శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి

సోమవారం, 27 ఆగస్టు 2018 (12:58 IST)
దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే.. శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి. కాటన్‌ దుస్తులతో పసుపు రాసిన వత్తులను వెలిగించడం ద్వారా దుష్ట శక్తుల ప్రభావం వుండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే దూదితో తయారైన వత్తులను వెలిగించడం శుభకరం. అరటికాడతో తయారైన వత్తులను వెలిగించడం ద్వారా సంతాన భాగ్యం చేకూరుతుంది. పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపమెలిగిస్తే.. సమస్త శుభాలు చేకూరుతాయి. తామర కాడలతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇక కొబ్బరినూనెతో దీపమెలిగిస్తే ఆరోగ్యం, సిరిసంపదలు చేకూరుతాయి. 
 
నువ్వులనూనెతో దీపమెలిగిస్తే.. శత్రుబాధ వుండదు. యమభయం తొలగిపోతుంది. నేతితో దీపం వెలిగిస్తే.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. మట్టితో తయారు చేసిన ప్రమిదలతో దీపమెలిగిస్తే.. కొత్త శక్తి, కొత్త ఉత్సాహం చేకూరుతుంది. 
 
దీపాన్ని ఆర్పేటప్పుడు పూవుతో వత్తాలి. నోటితో వూదడం చేయకూడదు. దీప సరస్వతీ అంటూ మూడు సార్లు, దీపలక్ష్మీ అని మూడు సార్లు, దీప దుర్గా అని మూడుసార్లు పలకాలి. కులదైవం పేరును మూడుసార్లు ఉచ్చరించి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని 12సార్లు నమస్కరిస్తే.. ఆ ఇంట సకల సంపదలు చేకూరుతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments