గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (17:12 IST)

‌ముగిసిన వాజ్‌పేయి అంత్యక్రియలు.. చితికి నిప్పంటించిన దత్త పుత్రిక

దివంగత ప్రధాని వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థలంలో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. యమునా నదీ తీరాన జరిగిన అటల్ బీహారీ వాజ్‌పేయి అంత

దివంగత ప్రధాని వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థలంలో వాజ్ పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. యమునా నదీ తీరాన జరిగిన అటల్ బీహారీ వాజ్‌పేయి అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు, రాజకీయ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.


త్రిదళ మర్యాదలతో, ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయికి అంత్యక్రియలు ముగిశాయి. ఆపై గంధపు చెక్కల చితిపై అటల్ బిహారీ వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. 
 
హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బీజేపీ అగ్రనేతలు, అభిమానులు, వాజ్‌పేయి కుటుంబసభ్యులు కన్నీటీ వీడ్కోలు పలికారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 
 
అంతకుముందు ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి భౌతిక కాయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది నివాళులర్పించారు. వాజ్ పేయి శవపేటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మన్మోహన్ నివాళులర్పించారు. అంతకుముందు, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, అమిత్ షా, భూటాన్ రాజు వాంగ్ చుక్, నేపాల్ మంత్రి తదితరులు తుది నివాళులర్పించారు. వాజ్ పేయిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.