తథాస్తు దేవతలంటే ఎవరు ?

శుక్రవారం, 4 జులై 2014 (17:58 IST)
తథాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తధాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటూ ఉంటారు. వీరినే తధాస్తు దేవతలు అంటారు. 
 
ఆలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను పలుమార్లు అనిన యెడల అట్టి దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటూ వుంటారు. ధనం వుండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ వుంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ అంటూ వుంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకుట మంచిది కాదు.
 
ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతుంటాం. ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులూ చదువుకున్నది ఒకే శాస్త్రం. మరి ఒక వైద్యుడి హస్తవాసే బాగోవడమేమిటి ? అంటే... ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే అనుకుంటూ ఉండటం, తధాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతుంటూంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటుంటాయి.
 
ఇదే విషయం చెడుకూ వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతుంటాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచివే జరుగుతాయి. తధాస్తు దేవతలూ ఆశీర్వదించండి.

అన్నీ చూడండి

అద్దె ఇంటిలో నుంచి వచ్చిమరీ అమ్మిన ఇంటిలోనే ఆయువు తీసుకున్నారు...

ఏడు అడుగులు వేసిన భర్త వదిలేస్తే.. ఆసరాగా ఉంటామన్న సన్నిహితులు మోసం చేశారు.... అందుకే...

ఇంట్లో భర్తను చంపుతుంటే.. ఇంటి బయట కాపలా ఉన్న భార్య... ఎక్కడ?

హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి మృతి

కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

అన్నీ చూడండి

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Show comments