శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : సోమవారం, 4 జులై 2016 (08:59 IST)

ఈ వారం మీకు అనుకూలమా? 4 నుంచి 9 వరకు గ్రహ ఫలితాలు

మిథునంలో రవి, బుధ, శుక్రులు, సింహంలో గురువు. రాహువు, తులలో కుజుడు. వృశ్చికంలో వక్రి శని, కుంభంలో కేతువు, వృషభ, మిథున, కర్కాటక, సింహంలో చంద్రుడు. 7వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం. 3న మాస శివరాత్ర

మిథునంలో రవి, బుధ, శుక్రులు, సింహంలో గురువు. రాహువు, తులలో కుజుడు. వృశ్చికంలో వక్రి శని, కుంభంలో కేతువు, వృషభ, మిథున, కర్కాటక, సింహంలో చంద్రుడు. 7వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం. 3న మాస శివరాత్రి. 6 జగన్నాథ రథోత్సవం. 9న స్కంద పంచమి. 
 
మేషం... అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆర్థిక ఇబ్బందులు సర్దుకుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొన్నిపనులు అనుకోకుండా పూర్తవుతాయి. బాధ్యతలు అప్పగించవచ్చు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో యత్నాలు మొదలెడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులు మీ సలహా పాటించి లబ్ధి పొందుతారు. విద్యార్ధులకు పరిచయాలు బలపడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దళారులను విశ్వసించవద్దు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
వృషభం... కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
నిర్ధిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పువస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పదవుల స్వీకరణకు ఆటంకాలు తొలగుతాయి. తొందరుపాటు నిర్ణయాలు తగవు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను అధిగమిస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది.
 
మిథునం... మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆది, సోమవారాల్లో అందిన ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తుల యూనియన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అధికారులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. ఉద్యోగయత్నంలో నిరుత్యాహం తగదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు నష్టాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాన్నిస్తాయి. వైద్య, సాంకేతిక కంప్యూటర్ రంగాలవారికి ప్రోత్సాహకరం.
 
కర్కాటకం... పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. చేజారిన వస్తువులు పత్రాలు తిరిగిపొందుతారు. మంగళ, బుధవారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు, ఆందోళన కలిగిస్తుంది. అవసరాలరు అతికష్టం మీద ధనం అందుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోండి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.
 
సింహం... మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు  విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ప్రయత్నపూర్వకంగా అలకాశాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సలహాలతో కొందరు లబ్ధి పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు యత్నాలు సాగిస్తారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. గురు, శుక్రవారాల్లో పంతాలు, వాగ్వాదాలకు దిగవద్దు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వాహిస్తారు. అధికారులకు మీపై  ప్రత్యేక గౌరవం కలుగుతుంది. సహోద్యోగులతో కీలక సమావేశాల్లో పాల్గోంటారు. నిరుద్యోగలకు చక్కని అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
కన్య... ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2, పాదాలు 
ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. సంప్రదింపులు,  వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆది, సోమ వారాల్లో ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. విమర్లు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కివస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. వాహన చోదకులకు దూకుడు తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
తుల... చిత్త 3, 4, పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చుల భారమనిపించవు. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. మంగళ, బుధవారాల్లో పట్టుదలతో శ్రమించినగానీ పులు పూర్తికావు. మీ శ్రీమతితో వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. వ్యాపారాలు లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఆడిటర్లు, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తులు వారికి పురోభివృద్ధి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
వృశ్చికం... విశాఖ 4వ పాదం, అనూరాధ, జేష్ట్య 
కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. ప్రముఖుల కలిసినా ఫలితం ఉండదు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. ఖర్చులు సామాన్యం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆది, గురువారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. విమర్శలు అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. వ్యవహారాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చికాకులు తొలగుతాయి. ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పత్రాలు, నగదు, వస్తువుల, జాగ్రత్త, పుణ్య, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు... మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఎదుటి వారి వ్యాఖ్యలు పట్టుదలను పెంచుతాయి. ఓర్పుతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. రుణబాధలు తొలగుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మంగళ, శనివారాల్లో హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి అశాజనకం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మకరం... ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. శుభకార్యాల్లో విలువైన కానుకలు చదివించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. గృహమార్పు యత్నం ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. గురు, శుక్రవారాల్లో ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. పనులు సానుకూలమవుతాయి. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. వ్యాపారాలు వేగవంతమవుతాయి. భాగస్వామిక కుదుర్చుకుంటారు. పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో తీరక ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. 
 
కుంభం... ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు నెలకొంటాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. బంధువుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ఆర్థిక అంచనాలు ఫలించవు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శనివారంనాడు పనులు అనుకున్న విధంగా సాగవు. వ్యవహారాల్లో పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. అనుభవజ్ఞులు సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. సహోద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మీనం... పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత, కార్యసాధనలో జయం, ఆకస్మిక ధనప్రాప్తి. పనులు వేగవంతమవుతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఖర్చులు అధికం. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. శనివారం నాడు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సంతానం భవిష్యత్‌పై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. చిరు వ్యాపారాలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. స్థిరాస్తిని అమర్చుకోలుగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.