గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:47 IST)

శంఖువును ఇంట్లో వుంచి పూజించడం చేయొచ్చా..?

దైవారాధనలో శంఖంకు అధిక ప్రాధాన్యత వుంది. శంఖువులతో చేసే అభిషేకాలతో విశేష ఫలితాలుంటాయి. శంఖువుతో శివునికి చేసే అభిషేకాలను కనులారా వీక్షించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. 
 
శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా ప్రతికూల ఫలితాలు చేకూరుతాయి. సముద్రంలో నుంచి లభించే శంఖువును ఇంట వుంచడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. తెలుపు రంగుతో కూడిన సముద్ర శంఖువును ఇంట్లో వుంచి పూజించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ శంఖువును ఇంట్లో ఎలా పూజించాలంటే.. శంఖువును శుభ్రంగా కడిగి, దానిని పసుపు, కుంకుమతో అలంకరించి.. ఓ వెండి పాత్రలో బియ్యం పోసి దానిపై వుంచాలి. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో శంఖువును పాలు లేదా నీటిని పోసి పూజించడం మంచిది. 
 
శంఖువు చేతికి తగినట్లుగా పెద్దదిగా కాకుండా వుండటం మంచిది. అందుచేత శంఖువును ఇంట్లో వుంచి పూజించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.