బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (23:18 IST)

వేసవిలో తాటిముంజలు.. రక్తపోటు మటాష్..

Palm fruit
తాటి ముంజలు శరీరానికి మంచి చేయడంతో పాటు బోలెడు పోషకాలను కూడా ఇస్తాయి. వేసవి వేడి నుంచి మనల్ని కాపాడతాయి. వీటిల్లో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు ఏ, బి, సిలు ఉంటాయి. వాటితో పాటు జింక్‌, పొటాషియం లాంటి మినరల్స్‌ కూడా ఉంటాయి.
 
ఎండాకాలంలో డీ హైడ్రేషన్‌ అవ్వకుండా ఉంటుంది. తాటి ముంజలు రకరకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి అంటున్నారు.
 
ముంజలు తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు రావు. ఎసిడిటీ తగ్గిపోతాయి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.