Webdunia - Bharat's app for daily news and videos

Install App

తపస్సు అంటే ఏమిటి?

Written By ఎం
Updated: గురువారం, 18 జులై 2019 (08:28 IST)
ఒక మంత్రాన్నో, ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు. ‘తపనే’ తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే ‘తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది.
 
ఎందుకంటే...
మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.. ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే ఇక్కడ మీకో సందేహం రావచ్చు, మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని. 
 
నిజమే...ఆలోచించడం వేరు. ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే, తపననే, తపస్సు అంటారు.
 
అది మంచి అయితే మంచి ఫలితాన్ని, చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి, విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించవచ్చు. 
 
ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం ‘సీతాకోకచిలుక’. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపు రుగులు వస్తాయి. 
 
ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఆ దశలో అది రాళ్ళలో, రప్పల్లో, ముళ్ళలో తిరుగుతూ, ఆకులు తింటూ కాలం గడుపుతుంది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి, తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. 
 
అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది.
 అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. 
 
అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక ఆత్మ సాక్షాత్కారంతో తరిస్తాడు.
 

అన్నీ చూడండి

ప్రకాష్ రాజ్ గారూ... మీకు మరీ ఈ బేసిక్స్ కూడా తెలియవా? అంటూ ఏకిపారేసిన నెటిజన్

అన్నా చెన్నారెడ్డిని చంపింది మనోళ్లే.. వైకాపాకు కష్టకాలం.. లీకైన జగన్ ఆడియో కాల్..

నా భార్య బస్సు కండెక్టర్‌తో పారిపోయింది... కేరళ యూట్యూబర్ అఖిల్ (video)

హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ రోడ్డు వచ్చేసింది.. ఇక ట్రంప్ టవర్ రాబోతోంది..

5 సెకన్లలో ప్రాణశక్తిని లాగేసిన విద్యుత్ శక్తి, కార్మికుడు మృతి, వీడియో

అన్నీ చూడండి

ఆషాఢ అమావాస్య.. ఈ రోజున ఇంట్లో ప్రశాంతత చాలా ముఖ్యం.. ఆడంబరాలొద్దు..

11-08-2026 మంగళవారం మీ రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది...

11 ఆగస్టు 2026, మంగళవారం పంచాంగం వివరాలు..

ఆ సమస్యలు తిరిగి రానివ్వని శ్రీ రామ నామం జపిస్తే చాలు

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments