శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (13:21 IST)

ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి..?

హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే స్వామి. ఆంజనేయుడు, మారుతి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. స్వామివారికి సంప్రదాయానుసారంగా శ్రీసీతారామ స్తుతి అత్యంత ప్రీతికరమైనది. రక్షణకు, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వ సాధారణం.
 
ఆంజనేయుని ప్రార్థనలో కొన్ని ముఖ్యమైనవి:
1. హనుమాన్ చాలీసా: గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన.
2. ఆంజనేయ స్తోత్రం: మనోజవం మారుత తుల్య వేగం.. వంటి శ్లోకాలతో కూడినది. ఇందులో అన్ని శ్లోకాలూ ప్రసిద్ధం.
3. శ్రీ ఆంజనేయ మంగళస్తుతి: వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, పూర్వాభాద్రాప్రభుతాయ మంగళవారం శ్రీ హనుమతే..
4. శ్రీ మారుతీ స్తోత్రం: ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయి శ్రీమతే..
5. సుందరకాండ: సుందరకాండ పారాయణ కూడా హనుమదారాధనే అంటారు.
6. హనుమత్పంచరత్న స్తోత్రం: శంకర భగవత్పాదుల విరచితం.. వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్.
7. హనుమంతుని ద్వాదశ నామ స్తోత్రం.
8. ఆంజనేయ మంగళాష్టకం.
9. హనుమన్నమస్కార: గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ రామాయణమహామాలారత్నం వందేనిలాత్మజమ్.
10. ఆంజనేయ దండకం: శ్రీ ఆంజనేయం ప్రన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం.. అని సాగే ఈ దండకం తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది.