Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి స్నేహం తప్పా... బలాలు.. బలహీనతలు చెప్పొద్దు!

Written By pnr
Updated: గురువారం, 7 జనవరి 2016 (10:57 IST)
అబ్బాయిలతో స్నేహం తప్పా... అంటే కాదు కానీ దానికి పరిధి దాటని స్నేహబంధం మంచిదని ప్రతి ఒక్కరూ చెపుతుంటారు. అలానే స్నేహం పేరుతో వారి గురించి వెనకా ముందూ తెలుసుకోకుండా గుడ్డిగా అడుగులు వేయడం మరీ తప్పని పెద్దలు హితవు పలుకుతారు. 
 
సాధారణంగా కాలేజీల్లో, ఆఫీసుల్లో... ఇలా ఎక్కడో ఓ చోట అబ్బాయిలు స్నేహితులవుతారు. నిజానికి కొన్ని సందర్భాల్లో తోటి అమ్మాయిలతో ఉండే పోటీ వారితో కలవనివ్వదు. అప్పుడు మగపిల్లలతో స్నేహమే మేలనుకుంటాం. అయితే ఇంకా మన సమాజంలో ఆడా, మగా స్నేహాన్ని పూర్తిగా అంగీకరించలేని పరిస్థితి. కాదనడానికేం లేకపోయినా ఎవరి పరిధి వారు మరిచిపోకుండా ఉంటే అది మీకు మేలు చేస్తుంది. 
 
కాస్త ఎవరైనా సన్నిహితంగా మాట్లాడుతున్నప్పుడు... మీ బలాలూ, బలహీనతలూ చెప్పే ప్రయత్నం చేయొద్దు. వాటిని ఆసరాగా తీసుకుని మీకు హాని తలపెట్టే ప్రమాదం లేకపోలేదు. అలానే అవతలి వారిని నమ్మి మీ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లూ, మెయిల్‌ ఐడీలూ చెప్పొద్దు. బ్యాంక్‌ ఖాతాలూ, ఇతర లావాదేవీల వంటివీ రహస్యంగా ఉంచుకోండి. 
 
ఇప్పుడు సామాజిక అనుసంధాన సైట్లదే హవా. వీటితో ఎంత సౌకర్యం ఉన్నా చాలాసార్లు మీ ఏకాంతాన్ని దూరం చేస్తుంటాయి. ఒకరిద్దరు అతి చనువు తీసుకునే స్నేహితులు తారసపడినా చాలా ఇబ్బందిపడుతుంటాం. అలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్లని కట్టడి చేసేందుకు తగిన నిబంధనలు పెట్టుకోవాలి. ముక్కూముఖం తెలియని వారితో స్నేహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

నేపాల్ వరదలు.. మానవత్వం సిగ్గుపడేలా మహిళ మృతదేహం చెవి బంగారు కమ్మలు చోరీ (Video)

కంగనా రనౌత్‌కు రాఖీ పంపిన రాందేవ్ బాబా - ఫోన్ చేసి మాట్లాడుతా...

ఆఫీస్‌లో సిగరెట్ పొగ, వాసన భరించలేక బెంగుళూరు మహిళ రాజీనామా - రిజైన్ లెటర్ వైరల్

ఇంట్లో హత్యకు గురైన ఢిల్లీ మోడల్ - జిమ్ ట్రైనర్‌పై ఆరోపణలు

మూడేళ్ల బిడ్డను వదిలేసి గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

Chiranjeevi : జి.వి. నారాయణరావు అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Show comments