శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:31 IST)

నాకిప్పుడు ఆమెతో శృంగారం చేయాలనిపిస్తోంది... ఎలా?

నాలుగేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. నాకిప్పుడు 40 ఏళ్లు. ఇటీవల మా ఆఫీసులో 25 ఏళ్ల అమ్మాయి ఉద్యోగానికి చేరింది. చాలా అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు తనకుతనే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంటుంది. ఓరోజు ఎందుకలా ఏడుస్తున్నావ్ అని అడిగాను. తన ప్రియుడు మోసం చేసి వెళ్లిపోయాడని చెప్పింది. ఓదార్చాను. 
 
ఇక అప్పట్నుంచి ఆమెకు అవసరమైన రకాలుగా సహాయం చేస్తూ వచ్చాను. ఒకరోజు నన్ను వారింటికి ఆహ్వానించింది. అందరికీ పరిచయం చేసింది. మధ్యాహ్నం భోజనం చేశాక ఎవరికివాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో ఆమె-నేను మాత్రమే వున్నాము. నాకు చాలా దగ్గరగా కూర్చున్నది. దాంతో నాలో కోర్కెలు కలిగాయి కానీ చెప్పలేదు. ఆమే ధైర్యం చేసి ఏమయినా చెప్పండి అని సుమారు గంటపాటు అడిగింది. కానీ నేనేమీ చెప్పలేదు. దాంతో టీ పెట్టి ఇచ్చి... ఇక బయలుదేరుతారా అంటూ నన్ను సాగనంపింది.
 
ఇలా జరుగుతుండగానే ఆమె ఇంట్లోవాళ్లు ఆమెకో పెళ్లి సంబంధం తెచ్చారు. దాంతో తనకు 3 లక్షలు డబ్బు అవసరమని చెప్పింది. మరో ఆలోచన లేకుండా డబ్బు ఇచ్చేశాను. ఆమె పెళ్లయిపోయింది. మా కంపెనీ నుంచి ఉద్యోగం మానేసింది. ఇటీవల ఓ రోజు ఫోన్ చేసి మనసులో వున్న ఆలోచన చెప్పాను. దాంతో ఆమె మా ఆయనకు అనుమానమొస్తుంది.. ఇక ఫోన్ చేయకు అని చెప్పింది. మరో రోజు ట్రై చేస్తే ఆ ఫోన్ పనిచేయడంలేదు. నాకు ఇప్పుడు ఆమెతో శృంగారం చేయాలనిపిస్తోంది. ఆమె ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది. ఆమె ఎందుకిలా మారిపోయింది..?
 
మీ ప్రవర్తన నిజంగా చాలా వింతగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మీరు ప్రతిఫలము కోరి ఆమెకు సహాయం చేశారా.. అసలు ఆమె అంటే మీకు అంత పిచ్చెక్కిపోయి ఉంటే వివాహం చేసుకుని ఉండాల్సింది. ఆమె ఏదయినా చెప్పండి అంటూ గంటపాటు అడిగినా జడ పదార్థంలా మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. అప్పుడే మీరు ఆమెను పెళ్లాడాలన్న ఆలోచన వున్నట్లు చెబితే తన పెద్దలతో మాట్లాడి వుండేది. మీరేమీ స్పందించకపోవడంతో ఆమె కేవలం మీరు స్నేహం వరకే అనుకుని వేరే వ్యక్తిని పెళ్లాడింది. ఇక మీరు చేయగలిగింది ఏమిటంటే... ఆమె జ్ఞాపకాలను ఇంతటితో వదిలేసి మీదైన జీవితాన్ని గడపండి.