గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:59 IST)

జగన్‌ను చూస్తుంటే నాకదే గుర్తుకొస్తోంది.. జెసి సంచలన వ్యాఖ్యలు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు అనంతపురం ఎంపి జె.సి. దివాకర్ రెడ్డి. ఇప్పటికే పలువురు నేతలను కడిగిపారేసిన జెసి, జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి అయ్యో.. జగన్ ఎందుకు ఇలా పుట్టాడు అనే బాధపడేవారని జె.సి.దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
 
జగన్‌కు అంతా తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని.. దీంతో రాజశేఖర్ రెడ్డి బాధపడేవారని చెప్పుకొచ్చారు. జగన్‌ను ఎప్పుడు చూసినా అస్సలు రాజశేఖర్ రెడ్డి ముభావంగా ఉండేవారని చెప్పారు. తనతోనే స్వయంగా చాలాసార్లు వై.ఎస్.ఆర్ ఈ విషయాన్ని చెప్పారని, నేను కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు జగన్‌ను చూస్తుంటే నాకు అదే గుర్తుకు వస్తోందని చెప్పారు జె.సి.దివాకర్ రెడ్డి.