మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (18:39 IST)

ఇలాగే ఉంటే ఆమెతో శృంగారం కావాలని అడుగుతానేమోనని భయమేసి వెళ్లడంలేదు...

నా గర్ల్ ఫ్రెండ్ నేను చాలా క్లోజ్‌గా ఉంటాము. మా ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి అనే ప్రస్తావన అయితే రాలేదు కానీ నేను ఎక్కువగా ఆమె ఇంటికి వెళుతుంటాను. ఓ రోజు ఇద్దరం చదువుకుంటూ ఉండగా ఆమె గబుక్కున లేచెళ్లి తలుపు జస్ట్ కాస్త దగ్గరగా వేసి మూత్రం పోసుకుంటోంది. ఆమె అలా మూత్రం పోస్తుంటే వచ్చే శబ్దం వింటూ ఉండగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్.

నాలో శృంగార కోర్కెలు కలిగాయి. ఆమె ముగించుకుని వచ్చినప్పటికీ ఆమెతో ఇదివరకటిలా మూవ్ కాలేకపోయాను. ఆమె నన్ను తాకితే చాలు నాలో ఏవో ఫీలింగ్స్. ఇలాగే ఉంటే ఆమెతో శృంగారం కావాలని అడుగుతానేమోనని భయమేసి వెళ్లడం మానేశాను. కానీ ఇప్పుడు ఆమే నావద్దకు వస్తోంది. ఆమెలో ఏ మార్పు లేదు కానీ... నాలో ఎందుకిలా మార్పు కలిగింది....?
 
ఇలాంటి ఫీలింగ్స్ కొందరిలో కలుగుతుండటం సహజమే. స్త్రీలకు సంబంధించిన వ్యక్తిగత భాగాల స్పర్శ తగిలినా, వాటికి సంబంధించిన ఇన్నర్ వేర్స్... అంటే ప్యాంటీ, బ్రాలను చూసినప్పుడు కొందరిలో ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మరికొందరిలో అమ్మాయిలు వాడే ఖర్చీఫ్‌లు చూసినా శృంగార పరమైన స్పందనలు కలుగుతాయి.

కాబట్టి ఇదేమీ అసాధారణమైనది కాకపోయినప్పటికీ... వాటిని మరో దిశగా వెళ్లనీయకుండా కళ్లెం వేయడం చేయాలి. ఇకపోతే... ఆమె మిమ్మల్ని అలాంటి దృష్టితో చూడకపోవడం వల్ల ఆమెకు ఎలాంటి ఫీలింగ్ కలుగడం లేదు. లేనిపోని ఫీలింగ్స్ పెట్టుకుని మనసు పాడుచేసుకోవద్దు. మునుపటిలా వుండటం అలవాటు చేసుకోండి.