ముగిసిన మాడా వెంకటేశ్వర రావు అంత్యక్రియలు పూర్తి
ఇటీవల కన్నుమూసిన సినీ హాస్య నటుడు మాడా వెంకటేశ్వర రావు అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో ఆయన నలుగురు కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చగా, మూడురోజుల క్రితం ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.
అయితే, విదేశాల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు రాక ఆలస్యం కావడంతో భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి శవాగారంలోనే భద్రపరిచారు. ఈరోజు ఉదయం కుటుంబసభ్యులు రావడంతో అపోలో ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహానికి తరలించారు. మాడా వెంకటేశ్వర రావుకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించాక, అంత్యక్రియలు పూర్తి చేశారు.