శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (15:41 IST)

పూణేలో జీబీఎస్ పదో కేసు.. 21 ఏళ్ల యువతి కిరణ్ చికిత్స పొందుతూ మృతి

GBS Virus
GBS Virus
పూణేలో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. తాజాగా 21 ఏళ్ల యువతి కిరణ్ రాజేంద్ర దేశ్‌ముఖ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కిరణ్‌కు మూడు వారాలకు పైగా జీబీఎస్‌తో పోరాడింది.
 
పూణే సంరక్షక మంత్రి అజిత్ పవార్ నియోజకవర్గం, స్వస్థలం అయిన బారామతిలో నివసించే కిరణ్, తన చదువు కోసం సింహగడ్ ప్రాంతంలోని బంధువులతో కలిసి ఉండగా, ఆమెకు ఈ వ్యాధి సోకింది. 
 
ఈ ప్రాంతంలో అనేక జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కిరణ్‌ కూడా ఈ వ్యాధి బారిన పడింది. ప్రారంభంలో, ఆమెకు విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయి. దీనితో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బారామతికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు నిపుణులు పరీక్షలు నిర్వహించారు.
 
బారామతిలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు ఉన్న లక్షణాల ఆధారంగా, వైద్యులు జీబీఎస్‌ని అనుమానించారు. తదుపరి చికిత్స కోసం ఆమెను పూణేలోని ఆసుపత్రిలో చేర్చమని ఆమె కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. కిరణ్‌ను జనవరి 27న ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది.