శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (12:40 IST)

అంతర్జాలంలో అన్నమయ్య శృంగార సంకీర్తనలు...!

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మహత్మ్యాన్ని, తత్వాన్ని సంకీర్తనల ద్వారా వ్యాప్తిచేసిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక వంశీయుల సమగ్ర సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా ఉన్న భక

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మహత్మ్యాన్ని, తత్వాన్ని సంకీర్తనల ద్వారా వ్యాప్తిచేసిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక వంశీయుల సమగ్ర సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరువ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు విశేష కృషి చేస్తోంది. అందులో భాగంగా తితిదే వెబ్‌సైట్‌లో అన్నమయ్య సాహిత్యం పేరుతో అందుబాటులో ఉంచిన సమాచారం భక్తులకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
 
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో లభ్యమైన 14 వేల సంకీర్తనలను 1935 నుంచి 1965వ సంవత్సరం వరకు 32 సంపుటాలలో ముద్రించారు. వీటిలో 21 సంపుటాలను ఆధ్యాత్మ సంకీర్తనలుగాను, మిగిలినవి శృంగార సంకీర్తనలుగాను విభజించారు. వీటిలో ఏ కీర్తన ఏ సంపుటంలో ఉందో తెలుసుకోవడం కష్టతరంగా ఉండేది. ఈ నూతన ప్రయత్నం ద్వారా కీర్తనలోని సాహిత్యం, ఏ సంపుటంలో ఉంది. రాగి రేకుల్లోని వరుస సంఖ్య తదితర వివరాలు తెలుసుకోవచ్చు. 
 
తితిదే ముద్రించిన 29 సంపుటాలను స్కాన్ చేసి అందరికీ అనుకూలమైన పద్థతిలో పిడిఎఫ్‌ ఫార్మాట్‌లో అంతర్జాలంలో ఉంచారు. ఆధ్మాత్మిక, శృంగార సంకీర్తలలను వేరుచేసి ఆకారాది క్రమంలో నిక్షిప్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. సంకీర్తనలను యూనికోడ్‌లో పొందుపరిచడం వల్ల సులభంగా చదవడంతో పాటు ఇతర భాషల్లోకి అనువదించేందుకు వీలవుతుంది. ఇందుకోసం తితిదే ఐటి విభాగం, టిసిఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. సంగీతం తెలియని వారు కూడా సంకీర్తనలను వినేందుకు వీలుగా ప్రముఖ పండితులతో త్వరలో సంకీర్తనా పఠనం చేయిస్తోంది తితిదే. సంకీర్తనలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.