Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహాలకు పూజలు చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి?

నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు.

Written By ivr
Updated: సోమవారం, 26 జూన్ 2017 (17:28 IST)
నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు. 
 
గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు. 
 
ఇక బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు. 
 
ఇక గ్రహ శాంతి అంటే?
గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యుల సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు. అయితే గ్రహశాంతి చేయించుకోవడం ద్వారా సదరు గ్రహ ప్రభావంతో ఏర్పడే బాధలు పూర్తిగా తొలగిపోవని.. ఆ బాధల నుంచి ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. గ్రహ ప్రభావం కాస్త తగ్గుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన : వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకుని మల్లారెడ్డి డ్యాన్స్ (వీడియో)

నేస్తమా ఇక శెలవు, బస్సు నాలుగు టైర్లకు నమస్కరించి కన్నీళ్లు పెట్టుకున్న డ్రైవర్, ఎందుకు? వీడియో

తెలంగాణాలో హాట్ టాపిక్‌గా కొండా సురేఖ భవిష్యత్?

కేసీఆర్ చాలా మంచోడు... ఈ కాంగ్రెస్సోళ్లే... కొండా సురేఖ కామెంట్స్

సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన అజిత్ - ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

04-09-2026 శుక్రవారం నాటి రాశి ఫలితాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం..

03-09-2026 గురువారం రాశి ఫలితాలు... కొత్త ప్రాజెక్ట్‌కు అనుకూలమైన రోజు

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Krishna Jayanti 2026 Significance : శ్రీకృష్ణ జయంతి పూజ.. కృష్ణుని జననానికి ఆధారాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments