Daily Horoscope
✕

భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది

Written By సిహెచ్
Updated: గురువారం, 29 జులై 2021 (23:34 IST)
భగవంతుని ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారమనేది చెట్టు బోదెలా పడి ఉంది. ఈ బోదెను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకొనే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది. 
 
నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నువ్వు నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచి వేస్తాను అని హెచ్చరించింది. దాంతో ఆ వ్యక్తి తనకు కావలసిన పనులన్నింటిని ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకున్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది, ఇప్పుడు నీ మెడ త్రుంచి వేస్తాను అంది ఆ భూతం.
 
పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్కక్షణం ఆగు. నేనిప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఆయనకు ఈ ఉదంతాన్ని తెలిపి అయ్యా.... నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవియ్యండి అన్నాడు. 
 
గురువుగారు అతనికి వంకరటింకరగా ఉన్న వెంట్రుకను ఒకదానిని ఇచ్చారు. దానిని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చెయ్యమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్లు ఆ వెంట్రుకను తిన్నగా చెయ్యడంలోనే నిమగ్నమయ్యింది. కానీ ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా... అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది. అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లు ఉంటుంది. మళ్లీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. మనలోని అహాన్ని తొలగించుకున్నట్లయితే భగవంతుని సానిధ్యం తప్పక లభిస్తుంది.

అన్నీ చూడండి

పీఆర్పీని స్థాపించిన విజయసాయి రెడ్డి.. సీఎం పోస్టుపై ఆసక్తి లేదంటూ ప్రకటన

ఏఐతో పాటు 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

ప్రపంచ దేశాల చూపు భారత్‌ వైపు : కేంద్ర మంత్రి ప్రవీణ్ ఖండైల్వాల్

మురసు తుఫాను బాధిత ప్రాంతాల్లో రూ.10 ఇస్తేనే చార్జింగ్

నవంబర్ 12న విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అన్నీ చూడండి

11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?

Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?

10-11-2026 మంగళవారం ఫలితాలు - సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి...

09-11-2026 సోమవారం దిన ఫలాలు - పందాలు, పోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments