1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (17:54 IST)

దేవుడిని సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడుతున్నారా?

దేవుడికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడాలి. మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవత్ ప్రసాదమే. కాబట్టి వీటిని ముందుగా ఆయనకే సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞత తెలిపే ప్రక్రియ మాత్రమే కాదు. మంచి లక్షణం కూడా. మనుషుల్లో రెండు రకాల తత్త్వంగలవారు వుంటారు. దేవుడి పట్ల పెద్దగా విశ్వాసం లేని వారు నాస్తికభావాలు గలవారు ఒకరు కాగా, ప్రతి విషయంలోనూ భగవంతుడిని నమ్మే ఆస్తికత్వం గలవారు మరొకరు. 
 
ఇద్దరి కోరికలను తీర్చేవాడూ భగవంతుడే. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు గ్రహించి, తనకు లభించిన వాటిని భగవంతునికి, ఇతరులకు అర్పించే వారంటే శ్రీమాన్ నారాయణుడికి వల్లమాలిన ప్రీతి. ఇటువంటి వారికి సంపదల్ని, విజయాల్ని సిద్ధింపజేస్తాడు. 
 
భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాదంగా స్వీకరించిన ఆహారానికి దైవత్వం లభిస్తుంది. ఇలా భగవంతునికి నైవేద్యం సమర్పించడం అస్తికుల లక్షణం. అందుచేత భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతకు చోటివ్వాలి. నిష్ఠతో స్వామికి సమర్పించి ఆపై ప్రసాదంగా స్వీకరించాలి.