శనీశ్వరుని ప్రభావం హనుమంతునిపై ఉండదట..! ఎందుకు?

శ్రీరామాయణంలోని ఒక చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఒక మార్గా

గురువారం, 19 జనవరి 2017 (10:49 IST)
శ్రీరామాయణంలోని ఒక చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఒక మార్గాన్ని నిర్మించారట. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడట. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంతో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు.
 
కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శని భగవానుడు తెలిపారు. చెప్పినట్లు హనుమాన్‌ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు. కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.
 
అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలి కింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతుని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
 
అందుకే శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతుంటారు. కాబట్టి శనివారం లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపము వెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడి ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంతో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే వారికి శనిగ్రహించే ఏర్పడాల్సిన ఈతిబాధలు సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

అన్నీ చూడండి

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

అన్నీ చూడండి

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తర్వాతి కథనం
Show comments