Daily Horoscope
✕

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

Written By సెల్వి
Updated: బుధవారం, 19 మార్చి 2025 (10:44 IST)
రంగ పంచమి అనేది ఫాల్గుణ కృష్ణ పక్ష పంచమి నాడు జరుపుకునే పండుగ. ఇది  హోలీ తర్వాత ఐదు రోజులకు వస్తుంది. హోలీ లాగానే రంగు పొడిని చల్లుకోవడం లేదా పూయడం అనే ఆనందకరమైన సంప్రదాయంతో దీనిని జరుపుకుంటారు. 2025లో రంగ పంచమి మార్చి 19, బుధవారం నాడు జరుపుకుంటారు. పంచమి తిథి మార్చి 18, 2025న రాత్రి 10:09 గంటలకు ప్రారంభమై మార్చి 20, 2025న తెల్లవారుజామున 12:36 గంటలకు ముగుస్తుంది.
 
రంగ పంచమి వెనుక కథ శివుడు, కామదేవుడికి సంబంధించినది. కామదేవుడు తన పూల బాణాలను ఉపయోగించి శివుడిని లోతైన ధ్యానం నుండి మేల్కొలపడానికి ప్రయత్నించాడు. కానీ ఇందుకు ఆవేశపూరితుడైన శివుడు తన మూడవ కన్ను తెరిచి కామదేవుడిని బూడిద చేశాడు. 
 
ఇది చూసిన కామదేవుని భార్య రతి, ఇతర దేవతలతో కలిసి అతని తిరిగి రావాలని వేడుకుంది. వారి భక్తికి చలించిన శివుడు కామదేవుడిని పునరుజ్జీవం అందించాడు. దీనిని వేడుకగా జరుపుకునే రోజే రంగ పంచమిగా చెప్పబడుతోంది. ఈ పండుగ ప్రతికూలతపై దైవిక శక్తి విజయాన్ని సూచిస్తుంది. ఈ పండుగ సందర్భంగా దేవతలకు రంగులు అర్పించడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

ఈ రోజున హిందూ భక్తులు శ్రీకృష్ణుడు మరియు రాధ దేవిని కూడా పూజిస్తారు. కృష్ణుడు, రాధ మధ్య దైవిక ఐక్యతకు నివాళులర్పించడానికి వారు పూజా ఆచారాలు నిర్వహిస్తారు.

రంగ పంచమి వేడుకలకు మరో దృక్కోణం ఉంది. ఈ పండుగ ప్రధాన లక్ష్యం "పంచ తత్వ" లేదా విశ్వాన్ని తయారు చేసే ఐదు అంశాలను సక్రియం చేయడం. ఈ ఐదు అంశాలు భూమి, కాంతి, నీరు, ఆకాశం, గాలిని కలిగి ఉంటాయి. మానవ శరీరం కూడా ఈ ఐదు అంశాలతో తయారైందని భావిస్తారు.

అన్నీ చూడండి

మద్యం మత్తు: మోటర్‌మ్యాన్ క్యాబిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువతి

భర్త సైగ చేయగానే హత్తుకున్న భార్య.. విడాకుల సంగతి గోవిందా.. (video)

ఏపీకి పెట్టుబడుల వివరాలు లీక్ - 15 అధికారులపై సీఎం విజయ్ సర్కారు కొరఢా

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసు.. త్వరతగతిన పరిష్కరించాలని పిటిషన్

Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

అన్నీ చూడండి

20-11-2026 - శుక్రవారం రాశి ఫలితాలు.. లాభనష్టాలను అంచనా వేయడం మంచిది

కోటి వత్తులంట.. ఒకేసారి దేశాన్ని తగలబెట్టేయండి మీ రీల్స్ భక్తితో... నెటిజన్ ఆగ్రహం, వీడియో

19-11-2026 - గురువారం రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సూచనలను..?

ఇంట్లో సంపద పెరగాలంటే.. గురువారం ఊరగాయలను కొనిపెట్టండి..

18-11-2026 - బుధవారం రాశి ఫలాలు- ఆర్థికంగా అనుకూలత కనిపించినా..?

తర్వాతి కథనం
Show comments