సోమవారం, 17 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మార్చి 2025 (17:56 IST)

ఐపీఎల్ 2025లో విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న రికార్డు!

Kohli
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్‌ మొదలుపెట్టేశారు. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు కూడా అడేస్తున్నారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం రీసెంట్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు క్యాంప్‌లో చేరాడు. అయితే, ఈ ఎడిషన్‌లో విరాట్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. 
 
విరాట్ ఇప్పటివరకు టీ20ల్లో 399 మ్యాచ్‌ల్లో 9 శతకాలు బాదాడు. ఇంకొక సెంచరీ చేస్తే పొట్టి ఫార్మెట్‌లో 10 సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌‍గా నిలుస్తాడు. ప్రస్తుతానికి ఈ టీ20ల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌ విరాట్ కోహ్లీనే. 
 
విరాట్ తర్వాత రోహిత్ శర్మ (8) రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్‌గా 22 సెంచరీలతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ టాప్‌‍లో ఉన్నాడు. అతడు 436 మ్యాచ్‌ల్లో 22 శతకాలు బాదాడు. 
 
క్రిస్ గేల్ - వెస్టిండీస్ - 22 సెంచరీలు (463 మ్యాచ్‌లు) 
బాబర్ అజామ్ - పాకిస్థాన్ - 11 సెంచరాలు (3098 మ్యాచ్‌లు) 
విరాట్ కోహ్లీ - భారత్ - 9 సెంచరీలు (399 మ్యాచ్‌లు) 
మైఖేల్ క్లింగర్ - ఆస్ట్రేలియా - 9 సెంచరీలు (206 మ్యాచ్‌లు)
రిలీ రోసోవ్ - సౌతాఫ్రికా - 8 సెంచరీలు (367 మ్యాచ్‌లు)