Daily Horoscope
✕

షిరిడీ సాయిబాబా మహిమాన్వితం..?

Updated: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (13:55 IST)
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. కానీ, సాయిబాబాను ముస్లింలు, హిందువులు సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగం కుదర్చడానికి ప్రయత్నించారు. బాబా మసీదులో నివసించారు. గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. బాబా రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు.
 
సాయి ముఖ్యమైన ఒక వాక్యం అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. చాలామంది భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. బాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ చాలా ముఖ్యమైనవి. అదైత్వం, భక్తిమార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. 
 
సాయిబాబా ప్రతీ గురువారం రోజున పూజలు చేస్తే మంచిదంటున్నారు. సాయిబాబా పూజించడం వలన సకలదోషాలు, పాపాలు తొలగిపోతాయి. దాంతో పాటు కోరిన కోరికలు తీర్చడంలో బాబా మించినవారెవ్వరు ఉండరు. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు. బాబా అందరికీ చెందినవారు. 
 
సాయిబాబా పెక్కు మహిమలు కనబరుస్తాయి. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. 

అన్నీ చూడండి

రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన బీహార్ వాసి (వీడియో)

అక్టోబర్ 23, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే పాస్ మార్కులు సాధించాల్సిందే...

ఏపీలో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

ఆవును కొరికిన కుక్క... శునకం మొరిగింది.. పాలను తాగిన 450మందికి రేబిస్ భయం

అన్నీ చూడండి

23-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - వృత్తిపరంగా కొత్త అవకాశం రావచ్చు..

22-10-2026 గురువారం దిన ఫలాలు - సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం...

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments