శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (13:55 IST)

ఇంట్లోని అన్నీ గదులు.. ఒకే కొలతలతో ఉండవచ్చా..?

ప్రతిఒక్కరికి ఇళ్లు నిర్మించాలనే ఆశ తప్పకుండా ఉంటుంది. ఈ ఆశ కొందరిలో నెరవేరుతుంది. మరికొందరిలో నెరవేరదు. అలానే ఇళ్ళు కట్టాలనే నిర్ణయం తీసుకున్నవారు.. ఇంట్లోని రూములన్నీ ఒకే కొలతలతో ఉండొచ్చా అని ఆలోచిస్తున్నారు. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ చిన్న విషయానికే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. అందుకోసం ఈ చిట్కాలు..
 
ఇంట్లో అన్ని రూములు ఒకే కొలతలతో ఉండొచ్చా వద్దా.. అని ఆలోచిస్తున్నారా.. గదుల విభజన దాని కొలతలు ఆయా గృహ యజమానుల అవసరం, గృహ సభ్యుల జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని గదులు ఒకే కొలత ఉండాలనేది ప్రాచీన నిర్మాణ పటిష్టతలో చెప్పబడింది. అది నేటి జీవన అవసరాలకు పనికిరాదు.
 
పైగా నిర్మాణ రంగంలో వచ్చిన పెను మార్పు వలన కూడా ఆ విధానం మారిపోయింది. ఒక ఆఫీసులో మీటింగ్ హాలు, పెద్ద డైనింగ్ హాలు పెట్టాల్సి ఉంటుంది. ఆఫీసరు కూర్చునే గతి అంత పెద్దది అవసరపడదు. 
 
సరైన వెంటిలేషన్ వచ్చే విధంగా స్థాన బలాలను బట్టి గదుల విభజన చేయాలి. ఇల్లు, కార్యాలయాలు కూడా చాలా విభిన్న కొలతలతో ఉంటాయి. వేడి ప్రాధాన్యతను బట్టి వాటిని శాస్త్రబద్ధంగా కట్టుకోవాలి.