సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:54 IST)

తేనెను ముఖానికి రాసుకుంటే..?

ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అదేవిధంగా అందానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.. ఓట్స్‌ను నీళ్లల్లో కాసేపు నానబెట్టాలి. ఆపై మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకున్న ఓ అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. తరువాత అరిచేత్తో తుడిచేసి మంచి నీళ్లతో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రెండు మూడు రోజులకు క్రమంగా చేస్తే ముఖం, మెడ భాగాలు మెరుస్తుంటాయి. 
 
కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడిచేయాలి. అందులో 10 చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మర్దన చేస్తే మంచిది. స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందుగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస ముక్కను ముఖానికి రుద్దుకుంటే మంచిదంటున్నారు బ్యూటీషన్లు. ఇలా రోజూ చేస్తుంటే ముఖవర్చస్సు కాంతివంతంగా మారుతుంది. ఎండవేడిమికి, వాయు కాలుష్యానికి నల్లబడ్డ చర్మం నిగారిస్తుంది. అలానే చర్మం సున్నితంగా మారుతుంది.
 
పొడిచర్మం నుండి తప్పించుకోవాలంటే అంత సులభం కాదు. దీనికి విరుగుడు తేనె. రాత్రి పడుకోబోయే ముందుగా తేనెలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత దూదితో తుడిచేస్తే సరిపోతుంది. పొడిచర్మంతో తలెత్తే సమస్యలు తగ్గుతాయి.