తులసీ దళాలను ఏ రోజైనా కోయవచ్చా? (video)
తులసీ దళాలు చాలా పవిత్రమైనవి. ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు తులసి జలం, దళాలు, తులసి రసాన్ని వాడుతారు. తులసీ దళాలు వేసిన జలాన్ని సేవిస్తే పుణ్యం, పురుషార్థం లభిస్తాయని పురాణ వచనం.
తులసీ దళాలను ఎప్పుడుపడితే అప్పుడు కోయకూడదు. ఆదివారం, శుక్రవారం రోజుల్లో, మన్వాదులు, యుగాదులు, సంక్రాంతి, పూర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, రాత్రులలోనూ, సంధ్యాకాల సమయంలో, మధ్యాహ్నానంతర సమయంలో తులసీ దళాలను కోయరాదని శాస్త్రంలో చెప్పబడింది.