సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 జులై 2019 (22:17 IST)

భగవద్గీతను అర్జునుడితో పాటు ఎవరు విన్నారు?

మానవ జన్మను సార్దకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాలి. కనీసం చదవలేనివారు వినాలి. అది కూడా సాధ్యం కాని పక్షంలో కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి. అలాగే గీతా గ్రంధాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికి ప్రయోజనకరమేనని.... యజ్ఞము చేసిన ఫలము లభిస్తుందని పురోహితులు అంటున్నారు.
 
అంతేకాకుండా భగవద్గీతను పూజించిన వారికి సమస్త భూమండలాన్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. భగవద్గీతను చదవడం వలన సకల పుణ్య తీర్దాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. గీతా గ్రంధం ఉన్నవారి ఇంట భూత ప్రేత, రోగ బాధలతో సహా దైవిక- దేహిక పీడలు తొలగిపోతాయి. 
 
ఇకపోతే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ గీతా బోధన చేయగా అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజ రూపంలో ఉన్న ఆంజనేయులు విన్నారు. అంతేకాకుండా గీతా మహత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పినట్లు చెప్పబడింది.