సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2017 (22:17 IST)

ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానప్రాప్తి... (వీడియో)

చిత్తూరు జిల్లా ప్రముఖ ఆలయాలకు పెట్టింది పేరు. తిరుపతికి సరిగ్గా 35 కిలోమీటర్ల దూరంలో నారాయణవనంకు అతి సమీపంలో కైలాసకోన ఉంది. 4 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యం అంతాఇంతా కాదు. కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలంటే ఈ ఆలయంలో పూజలు చేస్తే ఎంతో మంచ

చిత్తూరు జిల్లా ప్రముఖ ఆలయాలకు పెట్టింది పేరు. తిరుపతికి సరిగ్గా 35 కిలోమీటర్ల దూరంలో నారాయణవనంకు అతి సమీపంలో కైలాసకోన ఉంది. 4 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యం అంతాఇంతా కాదు. కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలంటే ఈ ఆలయంలో పూజలు చేస్తే ఎంతో మంచిది. పిల్లలు లేని వారు ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. 
 
అవును.. నిజమే.. వేలమంది ఇలా ఈ ఆలయంలో పూజలు చేసిన తరువాతనే పిల్లలు పుట్టి కుటుంబంలో సమస్యలు తొలగిపోయాయి. కైలాసకోన లోని జలపాతాలలో నిష్టగా స్నానమాచరించి తడిబట్టలతో కైలాసనాథుడ్ని పూజిస్తే ఫలితం దక్కుతుంది. ఎన్నో యేళ్ళుగా ఇలా కొనసాగుతూనే ఉంది. సమస్యలతో సతమతమయ్యేవారు కూడా పూజలు చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి.