సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 మే 2022 (20:53 IST)

కలియుగంలో ఈ ఆరు ప్రసిద్ధంగా కనబడతాయి

కలియుగంలో ఈ ఆరు ప్రసిద్ధంగా కనబడతాయి. మొదటిది దానం చేస్తే దారిద్ర్యం పట్టుకుంటుంది. రెండోది మహాలోభి పరమ ధనవంతుడవుతాడు. పాపపు పనులు చేసేవాడు ఎక్కువ కాలం జీవిస్తాడు.

 
పుణ్యాత్ముడు అనేవాడు త్వరగా మరణిస్తుంటాడు. ఉత్తమ కులంలో పుట్టినవాడు సేవకునిగా పని చేస్తుంటాడు. తక్కువ కులంలో జన్మించినవాడు అధికారం, పెత్తనం చెలాయిస్తుంటాడు. ఇవి కనబడుతున్నాయంటే కలి పరిపక్వత కాలం సమీపిస్తుందని అనుకోవాలి.

 
ఎవరితో పరిచయాన్నయినా అతిగా పెంచుకోకూడదు. అది చనువుగా మారితే వెటకారాలకు, వ్యంగ్యాలకు దారి తీస్తుంది. అదేపనిగా ఎవరి ఇంటికైనా తరచుగా వెళ్తూ వుంటే నిరాదరణకు దారితీయవచ్చు. మితంగా వుంటేనే అభిమానం పెరుగుతుంది.

 
మలయ పర్వతాలపైన విస్తారంగా వుండే మంచి గంధపు చెట్లు అక్కడి గిరిజనులకు సాధారణ చెట్లతో సమానం. వాటిని సైతం వంట చెరకుగా వాడుకోగల అతి పరిచయం ఆ చెట్లతో వారికి వుంటుంది. కానీ, అవి మనకు మాత్రం మహాప్రియం.