ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:20 IST)

తల్లికూతుళ్లతో అక్రమసంబంధం.. బెదిరించడంతో ఇద్దరినీ..?

murder
కలియుగంలో వున్నామనేందుకు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా తల్లీకూతుళ్లు ఒకే వ్యక్తిని అక్రమ సంబంధం నెరపారు. తల్లీ, కూతురు కలిసి కావాలని అతనితో సంబంధం పెట్టుకున్నారు.  అదే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
వడియారం అటవీ ప్రాంతంలో ఇద్దరు తల్లీ, కూతుర్ల శవాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కాగా వీరిద్దరూ మెదక్ జిల్లా చేగుంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన యాదమ్మ, ఆమె కూతురు సంతోష అని తేలింది. దీంతో యాదమ్మ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. విచారణను మరింత వేగం పెంచగా.. వడియారం గ్రామానికి చెందిన నగేశ్‌ను అనుమానించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 
 
తల్లీ, కూతుర్లకు నగేశ్‌తో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. అయితే వారిద్దరూ వావి వరసలు మరిచి నగేశ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
 
లేదంటే తమపై అత్యాచారం చేశావని కేసులు పెడతామని బెదిరించారు. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తూ వచ్చిన నగేశ్‌.. కొద్ది కాలం తర్వాత వారి వేధింపులు తట్టుకోలేక వారిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
 
ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన వారిని వడియారం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఫుల్లుగా వారికి మద్యం తాగించాడు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత గొంతునులిమి హత్య చేశాడని తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.