సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:20 IST)

లాడ్జిగదిలో తల్లీకుమారుడు ఆత్మహత్య.. పెట్రోల్ పోసుకుని నిప్పించుకున్నారు..

fire
కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీకుమారుడు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డిలోని రామాయంపేటలోని ఇద్దరు లాడ్జి గదిలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్‌కు పాల్పడ్డారు. 
 
ఆత్మహత్య కంటే ముందు కుమారుడు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారుతోంది. ఆ వీడియోలో తమ ఆత్మహత్యకు స్థానిక రాజకీయ నాయకులతో పాటు కొంతమంది పోలీసు అధికారుల వేధింపుల కారణమని తెలిపాడు. వ్యక్తిగతంగా కొందరు బెదిరించడం వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంతోష్ వెల్లడించాడు.
 
వివరాల్లోకి వెళ్తే.. పద్మ, సంతోష్‌ అనే తల్లీకుమారులిద్దరూ ఈ నెల 11న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. తల్లి పద్మ వైద్యం కోసం వీరు కామారెడ్డి వచ్చినట్టుగా తెలిసింది. 
 
అయితే వారు ఉంటున్న రూమ్‌లోనే నిప్పంటించుకున్నారు. వారి గది నుంచి తెల్లవారుజామన పొగలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది.. పోలీసులకు సమాచారమిచ్చారు.
 
ఈ క్రమంలోనే మంటలు ఆర్పేందుకు లోపలికి వెళ్లి చూడగా తల్లి, కుమారుడు చనిపోయి ఉన్నారు. దీంతో వాళ్ల సెల్ ఫోన్ పరిశీలించగా అందులో సెల్ఫీ వీడియోతో పాటు ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.