Webdunia - Bharat's app for daily news and videos

Install App

అష్ట మహాదానాలు అని వేటిని అంటారు?

Written By వాసు
Updated: గురువారం, 4 జులై 2019 (16:09 IST)
సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణంలోని ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు. అందులో భాగంగా... 1. నువ్వులు, 2. ఇనుము, 3. బంగారం, 4. పత్తి, 5. ఉప్పు, 6. భూమి, 7. ఆవులు వంటి వాటిని దానంగా ఇవ్వవచ్చు. ఇక ఎనిమిదవ దానంగా ఏడు ధాన్యాలను చేర్చారు. ఇందులో గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు ఉంటాయి. 
 
వీటిలో ఏదైనా ఒక్కదానిని లేదా అన్నింటినీ కలిపి దానంగా ఇవ్వవచ్చు. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి 
ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చుననేది శాస్త్రం చెప్తోన్న మాట.
 
యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరని చెప్తారు. భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి. సువర్ణ దానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది. పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భ‌యం 
ఉండ‌దు.

అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.
 
ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు. ఉప్పు, నువ్వులు, ధాన్యాలు, పత్తిని దానం చేయవచ్చు. ఈ దానాలను చేయడం ద్వారా లేని వానికి మనకు ఉన్నంతలో ఇవ్వడమనే పరమార్థం కూడా ఉంది. 

అన్నీ చూడండి

ఎవరూ లేనివేళ ఇంట్లో దూరి మనవరాలిపై తాతయ్య అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బ్రెయిన్ స్ట్రోక్‍తో మృతి చెంది పలువురి జీవితాల్లో వెలుగులు (వీడియో)

ఆంధ్రా వర్శిటీని వైకాపా కార్యాలయంగా మార్చిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్

పోలీసుల్లో పెరుగుతున్న అక్రమ సంబంధాలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీపీ సజ్జనార్

అయోధ్య రామాలయం విరాళలపై పార్లమెంట్‍‌లో స్కిట్ : అతిథి పాత్రలో రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

01-08-2026 నుంచి 31-08-2026 వరకు ఆగస్టు మాస ఫలితాలు

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.

తర్వాతి కథనం
Show comments