ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (13:08 IST)

అసలు వాస్తు అంటే ఏంటో తెలుసా..?

వాస్తు అంటే నివాస గృహం లేదా ప్రదేశం అని అర్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్థం. వాస్తుశాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. వాస్తుశాస్త్రంలో నాలుగు భాగాలు ఉన్నాయి. అవి.. భూమి వాస్తు, హర్మ్య వాస్తు, శయనాసన వాస్తు, యాన వాస్తు. 
 
పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టేవారు. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేమ్శరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. అలాంటి సమయాల్లో శివుని వంటి రాలిన ఓ చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఓ గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది.
 
ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది చేదవతలు భయభ్రాంతులయ్య్రా. బ్రహ్మం దేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు. సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఆ భూతాలు అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మం దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమైన ఆ పట్టి అధోముఖంగా కిందకు పడవేశారు. ఆ భూతం భుమిపై ఈశాన్య కోణంలో శిరస్సు, నైరుతి కోణాలు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల ఉండునట్లు అధోముకంగా భూమిపై పండింది.