శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (13:13 IST)

ఇంట్లో చీపురను ఎలా అమర్చాలి..?

భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. మీ కోసం వాటిలో కొన్ని...
 
1. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ(కుబేర స్థానం)ను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
 
2. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
 
3. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైఋతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదని విశ్వాసం. 
 
4. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలి.
 
5. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.
 
6. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడుతుంది.. అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడ్డట్లైతే అశుభ ఫలితాలు సంభవిస్తాయి. 
 
7. ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో.. తూర్పువైపు గల గోడలోనే పూజ అలమరను అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతోంది.