శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (18:11 IST)

ఈ నియమాలను పాటిస్తే 120 రోగాలకు దూరంగా వుండొచ్చట..

ఆరోగ్యం చక్కగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ధర్మం. మునుపటి రోజుల్లో వ్యక్తులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. దాని వలన శరీరం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ నేటి తరానికి మానసిక శ్రమ ఎక్కువ. లేనిపోని రోగాలు ఆవహిస్తున్నాయి. కొన్ని నియమాలను పాటిస్తే 120 రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
మనం సులభంగా చేయగల ఆ నియమాలు ఏంటో చూద్దాం. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే 2 నుండి 3 గ్లాసులు నీళ్లు తాగాలి. ఈ అలవాటు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. నిద్ర లేవగానే నీళ్లు తాగడం వలన రాత్రి నుండి శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ మలమూత్ర విసర్జన రూపంలో బయటకు వెళ్లిపోతాయి. మలమూత్ర విసర్జనలు ఒకేసారి పూర్తయితే చాలా మంచింది. 
 
అనారోగ్యం రాకుండా ఉంటుంది. మంచి నీటిని రాగి పాత్రలో రాత్రి మూసి ఉంచి తెల్లవారి తాగితే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే భోజనం చేసే ముందు 40 నిమిషాలు, భోజనం చేసిన తర్వాత ఒక గంటపాటు నీరు త్రాగకూడదు. తిన్న ఆహారం ఈసోపేగాస్‌లోకి వెళ్లినప్పుడు హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. 
 
తక్కువ పీహెచ్ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైమ్‌లకు ఉపయోగపడి జీర్ణక్రియను త్వరితం చేస్తుంది. నీరు తాగడం వలన ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలినాలు పేరుకుపోయి అనేక రోగాలు వస్తాయి. శీతలీకరించిన నీటిని తాగడం చాలా ప్రమాదకరం. శరీరంలో ఎప్పుడూ ఏదో ఒక క్రియ జరుగుతూనే ఉంటుంది. శరీరం వేడిగా ఉంటుంది. 
 
చల్లటి నీరు తాగడం వలన ఉష్ణోగ్రతలలో మార్పులు వచ్చి అనారోగ్యం వస్తుంది. కుండలో నీరు తాగవచ్చు. నీరు గుటగుటా తాగకూడదు. అలా తాగితే హైడ్రోక్లోరిన్ ఎక్కువ చర్య జరపాల్సి ఉంటుంది. జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అసిడిటీ పెరుగుతుంది. నీటిని టీ, కాఫీ లాగా సిప్ చేస్తూ త్రాగితే మంచిది.