శ్రీవారికి బంగారు కవచం, 7కిలోల వెండి పద్మపీఠం, 2 కిలోల వెండి కిరీటం... సమర్పించిందెవరు?
తిరుమల శ్రీవారికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ తమ స్థోమతకు తగినట్లు కానుకలు సమర్పించుకుంటారు. ప్రజల సొమ్మా, అతను వ్యాపారం చేసి
తిరుమల శ్రీవారికి భక్తులు భారీ స్థాయిలో కానుకలు సమర్పిస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ తమ స్థోమతకు తగినట్లు కానుకలు సమర్పించుకుంటారు. ప్రజల సొమ్మా, అతను వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో చేయించిందా అనేది వెంకన్నకే తెలియాలి. ప్రస్తుతం ఓ భక్తుడు సమర్పించిన కానుక వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది.
రెండు కిలోల బంగారు కవచం, ఏడు కిలోలున్న వెండితో చేసిన పద్మపీఠం, రెండు కిలోల బరువున్న వెండి కిరీటాన్ని భక్తుడు కానుకగా సమర్పించాడు. తిరుమలలోని శ్రీ భూవరాహా స్వామి ఆలయంలో ఈ కానుకలను తితిదే అధికారులు గుర్తించారు.
కానీ కానుకలు సమర్పించిన సదరు వ్యక్తి ఎవరనేది తెలియలేదు. కనీసం రసీదైనా తీసుకోకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతను సమర్పించిన కానుకల విలువ దాదాపు కోటి రూపాయలకు పైమాటేనని ఆలయ అధికారులు తేల్చారు.