నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు

సోమవారం, 11 ఏప్రియల్ 2016 (11:42 IST)
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 'బ్రహ్మోత్సవాలు'  జరగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా, తొలి రోజు అంకుర్పాణ కార్యక్రమం ఉంటుందన్నారు. 12న గరుడాధివాసం, 13న దేవతాహ్వానం, 14న ఎదుర్కోలు, 15న సీతారాముల కల్యాణోత్సవం, 16న మహా పట్టాభిషేకం జరుగుతుంది. 17న సదస్యం, 18న చోరోత్సవం, 19న ఊంజల్‌ ఉత్సవం, 20న వసంతోత్సవం, 21న చక్రతీర్థం నిర్వహిస్తారు. 
 
కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 16న గవర్నర్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. రూ.5 వేల విలువైన ఉభయ దాతల సెక్టార్‌ టిక్కెట్లను ఇప్పటికే విక్రయిస్తుండగా రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువైన టిక్కెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. 60 క్వింటాళ్ల తలంబ్రాలు, క్వింటా ముత్యాలతో ఈ సారి ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

అన్నీ చూడండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

Show comments