Daily Horoscope
✕

అలాంటి వారు శబరిమలకు రావొద్దు : కేరళ సర్కారు ఆదేశాలు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 10 నవంబరు 2020 (10:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో తొలిసారి వెలుగు చూసింది కేరళ రాష్ట్రంలోనే. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ప్రతి రోజూ సుమారుగా 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కోలుకున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇలాంటి వారికి కేరళ సర్కారు కొత్త ఆంక్షలు విధించింది. కొవిడ్‌-19 వైరస్ సోకి తిరిగి కోలుకున్న వారు శబరిమలకు రావొద్దని కేరళ సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. 
 
కోలుకున్న వారిలో మూడు వారాల నుంచి మూడు నెలల దాకా వైరస్‌ ప్రభావం ఉంటుందని, శ్వాస ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని చెబుతోంది. అలాంటి వారు శబరి కొండను ఎక్కేప్పుడు ఆక్సిజన్‌ తగ్గడం వల్ల ఇబ్బంది పడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. పల్మనాలజిస్టుల మార్గదర్శనంలో శారీరక వ్యాయామం చేసి, శ్వాస సమస్యలు లేవని నిర్ధారణ అయితే.. జాగ్రత్తలు తీసుకుంటూ శబరికి రావొచ్చని పేర్కొంది.
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి మండల పూజ సీజన్‌ ప్రారంభంకావడం.. డిసెంబరు చివరి నుంచి మకరవిలక్కు దర్శనాలకు అనుమతించడంతో.. శబరిమల యాత్రికుల కోసం సోమవారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో ప్రధానంగా భక్తులు మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తూ.చ. తప్పకుండా పాటించాలని సూచించింది. దర్శనానికి 24 గంటల ముందు నెగటివ్‌ రిపోర్టు ఉండాలని తెలిపింది.

అన్నీ చూడండి

ఎంత పెద్ద స్టార్ అయినా లోపాలు ఉంటాయ్ : శామ్ ఆల్ట్‌మెన్

విజన్ 2050 గురించి గొప్పలు చెప్తున్న చంద్రబాబు సర్కారు.. ఎద్దేవా చేసిన వైకాపా

అక్వాన్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష - కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి...

కేప్‌ టౌన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ప్రకృతి.. ఏప్రిల్ 14, 2027 తర్వాత తాగు నీటి సరఫరా లేదు

జెన్సన్ హువాంగ్‌కు మరో ఛాన్స్ లేదు..: ఎన్విడియా బోర్డు

అన్నీ చూడండి

17-11-2026- మంగళవారం రాశి ఫలాలు- అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

16-11-2026 సోమవారం దిన ఫలాలు - చేస్తున్న పనులపై శ్రద్ధ వహించండి...

15-11-2026 - ఆదివారం రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

15-11-2026 నుంచి 21-11-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య దాపరికం తగదు

శబరిమల: చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు

తర్వాతి కథనం
Show comments