తిరుమలలో పోటెత్తిన భక్తజనం - పట్టించుకోని తితిదే అధికారులు

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (11:12 IST)
వరుసగా నాలుగురోజుల పాటు సెలవు దినాలు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో పోటెత్తింది. అంబేద్కర్‌ జయంతి నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు రావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 32 కంపార్టుమెంట్లు నిండిపోయి 3 కిలోమీటర్లకుపైగా లైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా నిండిపోయాయి. అలాగే తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద అదే పరిస్థితి. తలనీలాలు సమర్పించడానికి 5 గంటలకుపైగా సమయం తిరుమలలో పడుతోంది. 
 
గదులు లేకపోవడంతో భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. అయితే వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తుల ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ఎప్పటిలాగే టిటిడి భక్తుల విషయంలో చేతులెత్తేసింది. తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది భక్తులు  గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా మరికొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. గురువారం శ్రీవారిని 70,520 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.88 కోట్లు వసూలైంది. 

అన్నీ చూడండి

యూట్యూబర్‌కు టిడిపి రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్న నాని

పిల్లలు లేరని దత్తత తీసుకుంటే తండ్రినే కడతేర్చాడు...

Nara Lokesh : దక్షిణ కొరియా రోడ్‌షోలో నారా లోకేష్

మానసికస్థితి సరిగా లేని కొడుకు నిత్యం వేధిస్తున్నాడనీ కడతేర్చిన తండ్రి...

భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే .. ఎస్ఐ నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు..

అన్నీ చూడండి

09-07-2025 బుధవారం ఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

Show comments