కేంద్ర బంగారం స్కీమ్‌పై తితిదే అనుమానాలు: గోల్డ్ డిపాజిట్లపై వెనక్కి.. పీఎన్‌బీలోనే..?

పంజాబ్ నేషనల్ బ్యాంకులో తిరుమల వెంకన్న బంగారం డిపాజిట్

బుధవారం, 2 మార్చి 2016 (14:21 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసునికి రోజు రోజుకు బంగారు నిల్వలు పెరిగిపోతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో 5300 కిలోల పసిడి నిల్వ ఉండగా, తాజాగా మరింత బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల శ్రీవారికి భక్తులు నగదు, వస్తువులు, బంగారు ఆభరణాల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. 
 
గతంలో భక్తులు స్వామి ఆభరణాలు చేయించి సమర్పిస్తుంటారు. హుండీలో వచ్చే బంగారు కానుకలను కరిగించి శుద్ధి చేసి వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలా మొట్టమొదట 2010లో 775 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేసింది. ప్రస్తుతం బంగారం నిల్వలు పెరగడంతో తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.75 శాతం వడ్డీ ఇచ్చేందుకు ముందుకు రావడంతో 1300 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. 
 
అలాగే ఎస్బీఐలో ఉన్న 1000 కేజీల బంగారాన్ని ఏప్రిల్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇదికాకుండా 1400 కేజీల ముడి బంగారాన్ని ఐఓబీకి అప్పగించి శుద్ధి చేశాక తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రం ప్రకటించిన పథకం ద్వారా బంగారం డిపాజిట్‌లపై 2.5 శాతం వడ్డీ లభించే అవకాశం ఉన్నా టీటీడీ అటువైపు మొగ్గుచూపట్లేదు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన పథకంపై తితిదేకి కొన్ని అనుమానాలుండటంతో.. వాటిపై క్లారిటీ వచ్చాక బంగారు పథకంలో తితిదే బంగారాన్ని డిపాజిట్ చేసే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.

అన్నీ చూడండి

పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?

Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం

జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

అన్నీ చూడండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

Show comments