మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (21:18 IST)

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం, ఎందుకంటే?

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు.
 
అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటిలో శుద్ధి చేశారు. అలాగే నామకోపు, శ్రీ చూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
 
ప్రతియేడాది నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది టిటిడి. అంతేకాదు పద్మావతి ఆలయంలో ఆగష్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలను కూడా నిర్వహించనున్నారు.