Daily Horoscope
✕

నేత్ర‌ప‌ర్వంగా ల‌క్ష దీపార్చ‌న‌...

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 24 నవంబరు 2019 (15:57 IST)
ప‌విత్ర కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకొని శ‌త‌స‌హ‌స్ర దీపార్చ‌న సేవామండ‌లి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య స్టేడియంలో శ‌నివారం సాయంత్రం నిర్వ‌హించిన సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు, ల‌క్ష దీపార్చ‌న కార్య‌క్ర‌మం నేత్ర‌ప‌ర్వంగా సాగింది. 
 
ఈ సంద‌ర్భంగా 300 అడుగుల మ‌హాలింగాన్ని భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి శ‌త‌స‌హ‌స్ర దీపాల‌తో వెలిగించి ఆనంద‌ప‌ర‌వ‌శుల‌య్యారు. 300 మంది జంట‌లు పాల్గొని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాన్ని ఆచ‌రించారు. కార్తీక దీపాల కాంతుల‌లో స్టేడియం ప్రాంగ‌ణం ఇల కైలాసాన్ని త‌ల‌పించింది. 
 
ఈ కార్య‌క్ర‌మానికి తాళ్లాయ‌పాలెంలోని శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ‌స్వామి పాల్గొని భ‌క్తుల‌కు దీపారాధ‌న యోక్క ప్రాశ‌స్థాన్ని వివ‌రించి అనుగ్ర‌హ‌భాష‌ణం చేశారు. కార్య‌క్ర‌మంలో యాబ‌లూరి లోక‌నాథ‌శ‌ర్మ‌, మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు, జి.డి.వి.ప్ర‌సాద్‌, నాగ‌లింగం శివాజీ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

అన్నీ చూడండి

ఆదివారం, అక్టోబర్ 18, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే..?

Stapede దుర్గామాత మండపంలో తొక్కిసలాట, 18 మంది మృతి

రాత్రి నూడుల్స్ తిన్నారు, తెల్లారేసరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శవాలుగా మారారు

మా రాధా బాబుకే ఓటు, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా గెలుపు ఖాయం

Gollapalli Reservoir: డ్యామ్‌లో మునిగి ఐదుగురు మహిళలు మృతి.. ఒకే కుటుంబానికి...?

అన్నీ చూడండి

18-10-2026... ఆదివారం నాటి రాశి ఫలాలు- కుటుంబ అవసరాల కోసం ముందుగానే..?

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

Chanakya Niti: చాణక్య నీతి- ఎవరితోనూ పంచుకోకూడని ఐదు విషయాలేంటంటే?

17-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?

తర్వాతి కథనం
Show comments