మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2019 (17:44 IST)

ఆటపాటల నడుమ వేడుకగా నటి అర్చన సంగీత్

తెలుగు అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి మొదలైంది. పారిశ్రామికవేత్త జగదీష్‌తో నటి అర్చన వివాహం జరగనున్న విషయం తెలిసిందే. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగనుండగా.. 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహం జరగనుంది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి వేడుక జరిగే గచ్చిబౌలిలోని కొల్లా మాధవరెడ్డి గార్డెన్‌లో సంగీత్ కార్యక్రమాన్ని ఆటపాటల నడుమ సందడిగా నిర్వహించారు. వధూవరులు అర్చన, జగదీష్ సినిమా పాటలకు స్టెప్పులేస్తూ కార్యక్రమాన్ని హుషారెత్తించారు.
 
అర్చన స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు కూడా ఈ కార్యక్రమంలో వధువరులతో పాటు ఆడిపాడారు. ఎంతో ఘనంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో అర్చన, జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.